దీపావళీ పిండివంటకాలు అరిసెలు

Durga
కావలసినపదార్థాలు: బియ్యం: ½ కేజీలi యాలకుల పొడి: 1టీ స్పూను తెల్ల నువ్వులు: 2 టీ స్పూన్లు గసగసాలు: 2 టేబుల్ స్పూన్లు బెల్లం: ½ కేజీ నూనె/నెయ్యి: వేయించడానికి సరిపడా పిండికోసం: . బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి. నీళ్లను వంపేసి నీడనే పొడిబట్టమీద బియ్యాన్ని ఆరనివ్వాలి.  తడిబియ్యం మూడువంతులు ఆరినాక మిల్లు పట్టించాలి. అంతేతప్ప పొడిబియ్యాన్ని మాత్రం పిండి పట్టడానికి వాడకూడదు.  బియ్యం కడిగి ఆరబెట్టే సమయం లేకపోతే బియ్యం ఓసారి కడిగి వెంటనే మిక్సీలో వేసి మెత్తగా పిండిపట్టుకోవచ్చు.  తయారు చేయ విధానము:  1. మందపాటి పాత్రలో తురిమిన బెల్లం, పావుకప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరవాత పలుచటి వస్త్రం లేదా టీ ఫిల్టర్‌తో బెల్లం నీళ్లను వడబోయాలి. ఈ నీళ్లను మళ్లీ పాత్రలో పోసి పాకం పట్టాలి. (సరైన పాకం వచ్చిందో లేదో తెలియాలంటే చిన్నప్లేటులో చల్లటినీళ్లు పోసి అందులో కొద్దిగా పాకాన్ని వేయాలి. దాన్ని వేళ్లతో తీసినప్పుడు ఉండలా అయితే పాకం వచ్చినట్లే) 2. ఇప్పుడు పాత్రను కిందకి దించి యాలకుల పొడి, నువ్వులు, గసగసాలు వేయాలి. వెంటనే బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పాకం పిండిని పీల్చుకునేవరకూ వేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: